వాళ్ళను కొట్టడానికే పవన్ కరాటే నేర్చుకున్నాడట.!

టాలీవుడ్ లో కరాటేలో ప్రావీణ్యం ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ తన మార్షలాడ్స్ కళను “అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్” సినిమాలో ప్రదర్శించారు. దాంతో పవన్ కు కరాటే పై ఉన్న పట్టు చూసి అంతా షాక్ అయ్యారు. అసలు పవన్ కళ్యాణ్ కరాటే నేర్చుకోవడానికి కారణం ఆయన అన్న మెగాస్టార్ అట. మెగాస్టార్ నాగబాబుకి కరాటే నేర్పించాలని అనుకున్నారట. కానీ నాగబాబు ఆసక్తి చూపలేదట.
దాంతో చిరు పవన్ కి ఎలాగైనా కరాటే నేర్పించాలని అనుకున్నారు. కానీ పవన్ కూడా అంతగా ఆసక్తి చూపలేదు. కానీ తన జీవితంలో ఎదురైన ఒక సంఘటన వల్ల పవన్ కరాటే నేర్చుకోవాల్సి వచ్చింది. అదేంటంటే చెన్నై లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ స్నేహితులు కొందరు చిరు సినిమాలు చూసి వచ్చి కామెంట్ చేసేవరట. తన అన్నపై బ్యాడ్ కామెంట్స్ చేయడంతో పవన్ కి చాలా కోపం వచ్చేదట. చిరు లుక్ పై కూడా విమర్శలు చేసేవారట.
దాంతో పవన్ కోపంతో వారిని కొట్టాలని డిసైడ్ అయ్యాడట. కానీ తాను బక్కగా ఉండటం వల్ల ఎవరినీ ఏం అనలేకపోయేవాడట. దాంతో పవన్ కళ్యాణ్ వాళ్ళను కొట్టడానికి కరాటే నేర్చుకున్నారు. అంతే కాదు అందులో బ్లాక్ బెల్ట్ సాధించాడు. అలా నేర్చుకున్న కరాటే పవన్ కు సినిమాల పరంగా ఎంతో ప్లస్ అయ్యింది. ఇక ఇప్పటికీ పవన్ లో ఆ ఎనర్జీ కనిపిస్తూనే ఉంటుంది.