పవన్ రాకతో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి కల

పవన్ రాకతో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి కల

ప్రముఖ నటుడు నాగబాబు కూతురు నిహారికా వివాహం ఈ రోజు రాత్రి చైతన్య తో జరగనున్నది. వీరి పెండ్లి కోసం మెగా బ్రదర్ రాజస్తాన్ లోని ఉదయ్ పాలస్ ను బుక్ చేశాడు. గత వారం రోజులనుండి మెగా ఫ్యామిలీ ఇంట పెండ్లి సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు రాజస్తాన్ లోని ఉదయ్ పాలస్ కు చేరుకున్నారు.

మెగా, అల్లు ఫ్యామిలీ అందరు తమ తమ జెట్స్ ఫ్లైట్స్ వేసుకుని అక్కడకు చేరిపోయారు. ఇక మెగా, అల్లు ఫ్యామిలీ రెండు రోజులనుండి నుండి సంగీత్ లో ఆట పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబందించిన ఫోటోస్ వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన పిల్లలు అఖీర, అధ్యలతో ఉదయ్ పాలస్ కు చేరుకున్నాడు. అసలు పవన్ నిహారికా మ్యారేజ్ కు వస్తాడ రాడ అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఎందుకు అంటే నివర్ తూఫాన్ వల్ల నష్ట పోయిన రైతుల తరుపున పోరాటం చేస్తున్నాడు.

అయితే నిన్న సడన్ గా ఎయిర్పోర్టు కనిపించే సరికి నిహారికా పెళ్లి కి వెల్లుతున్నట్లు గా కన్ఫర్మ్ అయింది. ఇక పవన్ రాకతో మెగా ఫ్యామిలీ మొత్తం సంతోషంలో ఉంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగ బాబు, పవన్ కళ్యాణ్ లు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. నిహారికా మ్యారేజ్ లో పవన్ ఎంతో సంతోషం తో ఉన్నాడు. నిహారికా, చైతన్యలను పవన్ స్పెషల్ గా విష్ చెయ్యడం జరిగింది. ఈ రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వీరి వివాహం జరుగుతుంది.

follow us