ఇంట్లో పది గంటల దీక్ష ఏంటి పవను?

ఇంట్లో పది గంటల దీక్ష ఏంటి పవను?

మొన్నటి వరకు వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న పవన్‌ కళ్యాన్‌ షెడ్యూల్‌ గ్యాప్‌ లో నివార్‌ తుఫాన్‌ బాధితులను పరామర్శించాడు. ఆ సమయంలో ప్రభుత్వం 10 వేల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. కాని ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఇంట్లోనే 10 గంటల పాటు దీక్ష అంటూ మొదటు పెట్టాడు. బయటకు వెళ్తే మళ్లీ షూట్‌ స్టార్ట్‌ అయ్యే టైంకి రావడం కష్టం. అందుకే ఇలా ఇంట్లోనే దీక్షను పవన్‌ కొనసాగిస్తున్నాడు. ఏంటో ఈ పవన్‌.. ఏంటో ఈయన రాజకీయాలు…ఎవరికి అర్థం కావడంలేదు అని కొంత మంది పవన్ పై సెటైర్స్ వేస్తున్నారు.

రైతుల మధ్య చెయ్యాలిసిన దీక్షను ఇలా ఆయన సొంత నివాసంలో దీక్ష చేస్తున్నాడా లేక నటిస్తున్నాడా, కెమెరా ముందు కూర్చొని తన నెక్స్ట్ సినిమా కోసం యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడా అంటూ సోషల్ మీడియా నుండి ట్రోల్స్ వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ ఇంట ఫంక్షన్స్ కు దూరంగా ఉంటూ వస్తున్న పవన్ ఆయన అన్న నాగబాబు కూతురు నిహారికా మ్యారేజ్ మరో రెండు రోజుల్లో జరగనున్నది. ఆ మ్యారేజ్ కు పవన్ అటెండ్ కావాలి కావున ఇలా 10 గంటలు మాత్రమే దీక్ష చేస్తున్నాడు అంటున్నారు.

follow us