రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ విరాళం..ఎంతంటే.?

  • Written By: Last Updated:
రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ విరాళం..ఎంతంటే.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.30లక్షల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మత్కడుతూ…దేశం నలుమూలల నుండి రామ మందిరం నిర్మాణం కోసం ప్రజలు విరాళాలు ఇస్తున్నారని అన్నారు. పవన్ ఇప్పుడు తన వంతు సహాయం చేస్తున్నానని తెలిపారు. జనసేన పార్టీ నుండి ఇతర నేతలు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా మందిర నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ట్రస్ట్ కు అందించారు.

డోనేషన్ ఇస్తున్న సమయంలో పవన్ శ్రీరాముడిపై ఆయనకు ఉన్న భక్తిని చాటుకున్నారు. రాముడు ధర్మానికి ప్రతిరూపమని అన్నారు. రాముణ్ణి ఆదర్శంగా తీసుకునే భారత్ ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురైనా నిలదొక్కుకోగలుగుతుందని అన్నారు. భారత్ అన్ని కులాల వారు, మతాల వారు కలిసి కట్టుగా ఉండే దేశమమని అన్నారు. ఇక నటుడిగా పవన్ టాలీవుడ్ నుండి మొదట విరాళం ఇచ్చారు.

follow us