నేడు ఖుషీ.. రేపు తొలిప్రేమ.. పవన్ క్రేజ్ అలాంటిది

  • Written By: Last Updated:
నేడు ఖుషీ.. రేపు తొలిప్రేమ.. పవన్ క్రేజ్ అలాంటిది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కు ఫ్యాన్స్ కాదు భక్తులు మాత్రమే ఉంటారని అందరికీ తెలిసిందే. పవన్ సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండుగే. అది పాతదా.. కొత్తదా అనే తేడా లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. తాజాగా నేడు పవన్ కు ఇంత ఫ్యాన్ బేస్ తెచ్చిన సినిమా ఖుషీ రీ రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కొత్త సినిమా రిలీజ్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టింది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ క్రేజ్ ను చూసాకా పవన్ రేంజ్ ఎలాంటిదో అర్దం ఐపోతుంది. ఇక ఇదే క్రేజ్ ను మేకర్స్ ఉపయోగించుకుంటున్నారు.

తాజాగా పవన్ మరో సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ను యూత్ ఐకాన్ గా నిలబెట్టిన సినిమా తొలి ప్రేమ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి రెడ్డి నటించింది. వచ్చే ఏడాదికి ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ఆ సినిమా రీ రిలీజ్ కు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా థియేటర్ లో ఎలాంటి రచ్చ రేపుతుందో చూడాలి.

follow us