చరిత్రలను చుట్టేస్తున్న మెగా ఫ్యామిలీ హీరోలు !

మెగా ఫ్యామిలీ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు చరిత్రాత్మక సినిమాలను చేస్తున్నారు. సినీ ప్రేక్షకులు కూడా అలాంటి కథలనే ఇష్ట పడుతున్నారు. దర్శకులు, నిర్మాతలు కూడా ఆనాటి రియల్ హీరోల జీవిత చరిత్రను బయోపిక్ రూపంలో తీసుకువచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్రను తెర రూపంలోకి తెచ్చి విజయం సాదించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతరామరాజు పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ బంది పోటు గొన గన్నారెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
మెగా స్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ డైరెక్షన్ లో పండగ సాయన్న (అధికారికంగా ప్రకటించలేదు) అనే చారిత్రక యోధుడు పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పీరియడికల్ మూవీ ఇది. ఈ చిత్రం యొక్క టైటిల్ పై పలు రకాల పేర్లు వినిపిస్తున్నాయి బంది పోటు , గజ దొంగ… ఇలా రకరకాల పేరులు వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.