వారాహి కలర్ విషయంలో వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..వైసీపీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసారు. దీనికి వారాహి అనే పేరు పెట్టడం జరిగింది. తాజాగా ట్రయిల్ రన్ వేసిన పవన్ దానికి సంబదించిన వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అయితే వారాహి రంగు ఫై వైసీపీ నేతలు పలు విమర్శలు చేస్తూ వివాదం సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఆలీవ్ గ్రీన్ కలర్‌తో ఉన్న షర్ట్‌ను ట్వీట్ చేస్తూ.. ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా అంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ముందు నా సినిమాలను అడ్డుకున్నారు. తరువాత విశాఖ పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా చేశారు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా తన కారును అడ్డగించారని వైసీపీ పై పవన్ విమర్శలు చేశారు. ఇప్పుడు ఎన్నికల కోసం సిద్ధం చేసిన వాహనం రంగు మీకు సమస్యగా మారిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.