అన్ స్టాపబుల్ షో కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కు సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో షో లో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ జరుపుకుంటుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు గోపీచంద్ వచ్చి సందడి చేసినట్లు ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.
ఇక ఇప్పుడు ఈ షో కు పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ లతో ఈ ఎపిసోడ్ ఉండబోతుంది అని బాలయ్య పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 కి రావడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారట. త్వరలోనే ఎపిసోడ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్.. సినిమా ప్రమోషన్లలో తప్ప .. టాక్ షోలు వంటి వాటికి హాజరైంది లేదు. ఒకవేళ బాలయ్య షోకి వస్తే ఆ ఎపిసోడ్ మాములుగా ఉండదని అంత భావిస్తున్నారు. మరి నిజంగా పవన్ వస్తాడా..లేదా అనేది చూడాలి.