పవన్ సినిమా కోసం దూకుడు పెంచిన హరీష్ శంకర్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ తో పాటు హరిహరివీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాల తరవాత పవన్ హరీష్ శంకర్ ల ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమాపై కూడా ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం హరీష్ శంకర్ ఇప్పుడు దూకుడు పెంచారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం ప్రిప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కూడా ఈ సినిమా ఆల్బన్ ఇప్పటికే మొదలు పెట్టారట. అంతే కాకుండా రెండు పాటలను కూడా కంపోజ్ చేసారట. త్వరలోనే దేవీశ్రీ పూర్తి ఆల్బమ్ ను పూర్తి చేస్తారట.
ఇదిలా ఉండగా మరికొన్ని వారాల్లో సినిమాలో నటించే నటీనటుల వివరాలను కూడా ప్రకటించబోతున్నట్టు సమాచారం. సినిమాకు సంభందించిన పనులన్నీ శరవేగంగా పూర్తి చేసి పవన్ ఫ్రీ అవ్వగానే సినిమాను పట్టాలెక్కించాలని హరీష్ శంకర్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను రీచ్ అవుతారా లేదా చూడాలి.