బాలయ్య సెట్ లో పవన్ కళ్యాణ్ సందడి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ …బాలయ్య సినిమా సెట్ లో సందడి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వీర సింహరెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ సినిమా సెట్ కు పవన్ కళ్యాణ్ వచ్చి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. వీర సింహ రెడ్డి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా..పవన్ కళ్యాణ్ తో నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ వీరసింహరెడ్డి సినిమా సెట్ కు పవన్ హాజరై సినిమా విశేషాలని అడిగితెలుసుకున్నారు.
నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్‌స్టాపబుల్’లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మేరకు ఆహా కూడా హింట్ ఇచ్చేసింది. ఈ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబరు 27 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధిస్తాడు? పవన్ కళ్యాణ్ ఎలా సమాధానాలు ఇస్తాడు? అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.