పవన్ క్రిష్ సినిమాకు మొదలయ్యిన లీకుల కష్టాలు.!

pawan kalyan photo leaked from the sets of pspk 27
pawan kalyan photo leaked from the sets of pspk 27

పవర్ స్టార్ సినిమాలను లీకుల కష్టాలు వీడటం లేదు. అప్పుడెపుడో అత్తారింటికి దారేది సినిమాకు మొదలై ఇప్పటికీ వెంటడుతూనే ఉన్నాయి. సినిమాలోని సీన్స్ లీక్ అవ్వడం, షూటింగ్ సమయంలో ఫోటోలు లీక్ అవ్వడం ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇటీవల పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా నుండి ఫోటోలు, పవన్ నడుస్తున్న వీడియోలు లీక్ అయ్యాయి. కాగా ఇప్పుడు పవన్ క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా నుండి ఒక ఫోటో విడుదయ్యింది. ఈ ఫొటోలో పవన్ ఫస్ట్ లుక్ లో కనిపించిన డ్రెస్ లో కనిపిస్తున్నాడు.

కోర మీసాలతో పవన్ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఈ ఫోటోను తీశారు. అయితే ఈ ఫోటో పెద్దగా క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరి హర వీరమల్లు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రతం కధాంశం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను హైదరాబాద్ శివార్లలో ఓ సెట్ వేసి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.