పవన్ కళ్యాణ్ ఒక్కరు కాదు ఇద్దరు

అజ్ఞాతవాసి సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఆపై జనసేన పార్టీ స్థాపించి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. 2014 అసెంబ్లి ఎలక్షన్స్ లో పార్టీ ఓడిపోవడంతోకాస్త సైలెంట్ అయ్యారు. అటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే, సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో వకీల్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
క్రిష్ తో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ కలిగిన సినిమా ఒక్కటున్నది. అలాగే హరీష్ శంకర్ తో మరో సినిమాను చెయ్యబోతున్నాడు. గతంలో వీరి కాంబో లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం రీకార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వరస ఫ్లాప్స్ తో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఆ చిత్రం పెద్ద బూస్టింగ్ ఇచ్చింది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. నెక్స్ట్ హరీష్ తో చెయ్యబోయ్యే సినిమాలో పవన్ రెండు పాత్రలో నటిస్తున్నాడని సినీ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులు గా డబుల్ రోల్ లో నటిస్తున్న మొదటి చిత్రం కూడా ఇదే కాబోతుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోను, అలాగే లైవ్ లో ఉండి కథను ఫ్లాష్ బ్యాక్ వరకు తీసుకువెళ్లే కొడుకు పాత్రలో పవన్ నటించబోతున్నట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం హరీష్ సినిమా అప్డేట్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాదిస్తుందని గట్టి నమ్మకం తో ఫ్యాన్స్ ఉన్నారు.