పవన్ ప్రైవేట్ పార్టీ ఫోటోస్, వీడియో లు లీక్ ??

  • Written By: Last Updated:
పవన్ ప్రైవేట్ పార్టీ ఫోటోస్, వీడియో లు లీక్ ??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తరువాత అటు పోలిటికల్ గా ఇటు సినిమా లోను ఆక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు. 2014 అసెంబ్లి ఎలెక్షన్స్ లో పార్టీ ఓటమి చెందిన తరువాత ఆయన మరల సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో “వకీల్ సాబ్ “అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాలీవుడ్ “పింక్” సినిమా ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సినిమా స్టార్స్ పై ఫేక్ న్యూస్ అండ్ గాసిప్స్ రావడం సహజం. అలాంటి వార్తలనుండి బయట పడేందుకు వాళ్ల తరుపున అధికారిక ప్రకటన ఎవరో ఒక్కరూ చేస్తూనే ఉంటారు.

తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబందించిన ఓ ఫేక్ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. “పింక్” సినిమా తమిళ్. తెలుగు. బాషలో రీమేక్ అయ్యింది. అందులో నటించిన హీరోలకు బోనీ క‌పూర్ పార్టీ ఇచ్చాడని సినీ పరిశ్రమ కు చెందిని పలువురు స్టార్స్ హాజరు అయ్యారని ఆ పార్టీ కి తమిళ్ హీరో అజిత్ కూడా వచ్చాడని సమాచారం. పార్టీ లకు ఆడియో ఫంక్షన్స్ కు దూరం గా ఉండే పవన్ కూడా వచ్చాడని వాటికి సంబందించిన ఫోటోస్, వీడియో లను బయటకు రాకుండా నిర్మాత బోనీ కపూర్ జాగ్రత్తలు తీసుకున్నారని మాటలు వినిపించాయి. ఈ విషయం పై నిర్మాత టీమ్ వివరన ఇచ్చింది బోనీ ముంబై లో ఉన్నాడు. హైదరాబాద్ కు రాలేదు అని వివరణ ఇచ్చింది. పింక్ హీరో లకు పార్టీ ఇవ్వలేదు అని తేల్చి చెప్పింది. అది ఒక్క గాలి వార్తా అంటూ కొట్టి పారేసింది.

follow us