ఫేక్ న్యూస్ ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్, రజనీకాంత్ ..!?

Pawan kalyan Rajinikanth
Pawan kalyan Rajinikanth

సూపర్ స్టార్లు రజనీకాంత్, పవన్ కల్యాణ్ చేసిన రెండు ట్వీట్లను .. ట్విట్టర్ తొలగించింది. సూపర్‌ స్టార్లు చేసిన ట్వీట్లను తొలగించడం అంటే.. ఓ రకంగా.. అదో సంచలనమే. సాధారణంగా ట్వీట్లను ట్విట్టర్ తొలగించదు. ముఖ్యంగా.. వెరీఫైడ్ అకౌంట్ల నుంచి చేసిన ట్వీట్లను తొలగించదు. కానీ ఈ ఇద్దరి ట్వీట్లను.. అదీ కూడా.. ప్రజలకు అవేర్ నెస్ కలిగించేందుకు ప్రజల్ని.. కరోనాపై పోరాటానికి సంకల్పించేందుకు చేసిన ట్వీట్లను తొలగించడం.. కలకలం రేపింది. అయితే.. దీనికి ట్విట్టర్ సరైన కారణం చెప్పింది. అది.. రజనీకాంత్, పవన్ కల్యాణ్ ఇద్దరూ.. ఫేక్ న్యూస్‌ను ట్వీట్ చేయడమేనని తేల్చింది. వీరిద్దరూ చేసిన ఫేక్ న్యూస్ ట్వీట్ కరోనా గురించే.. అదీ కూడా… జనతా కర్ఫ్యూ గురించే.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకి … అందరూ మద్దతు పలికారు. సెలబ్రిటీలు అందరూ.. తమ తమ స్టైల్లో..  అభిమానులకు పిలుపునిచ్చారు. అలా..రజనీకాంత్, పవన్ కల్యాణ్ కూడా పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ పాటిద్దామని.. చెప్పి ఉంటే సరిపోయేది కానీ.. వీరు.. మరో ఉపదేశం కూడా ఇచ్చారు. తమ ట్వీట్లలో.. జనతా కర్ఫ్యూ వల్ల ఎలా కరోనాను జయించవచ్చో వివరించారు. పధ్నాలుగు గంటల కర్ఫ్యూ పాటించడం వల్ల.. వైరస్ చచ్చిపోతుందని చెప్పుకొచ్చారు. వైరస్ జీవిత కాలం పన్నెండు గంటలేనని.. పధ్నాలుగు గంటలు జనతా కర్ఫ్యూ పాటించడం వల్ల.. ఆ వైరస్ చచ్చిపోతుందని.. అందుకే కర్ఫ్యూ పాటించాలని పిలపునిచ్చారు. కానీ.. అదంతా ఫేక్ ప్రచారం అని.. ట్విట్టర్ తేల్చేసింది. అందుకే.. ఆ ట్వీట్లను డిలీట్ చేసింది.

సోషల్ మీడియాలో కరోనాపై సాగుతున్న ఫేక్ ప్రచారాలు ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఎవరి స్థాయిలో వారు.. మందును కనుగొని..దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఫలితంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించని సమాచారాన్ని కూడా సెలబ్రిటీలు పోస్టు చేస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో మరింత గందరగోళం పెరుగుతోంది. దీన్ని కంట్రోల్ చేయడానికి సలెబ్రిటీల ట్వీట్లను ట్విట్టర్ టార్గెట్ చేసిటన్లుగా తెలుస్తోంది.