యంగ్ బ్యూటీ తో పవన్ రొమాన్స్..కారణం అదేనా..?

యంగ్ బ్యూటీ తో పవన్ రొమాన్స్..కారణం అదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయాలు , మరోవైపు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ ఫై హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు తమిళ్ మూవీ రీమేక్ చేయబోతున్నాడు. ఇవి ఇలా ఉండగానే సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కు జోడిగా ధమాకా ఫేమ్ శ్రీ లీల ను ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ పక్కన శ్రీ లీల ఏంటి అని కొంతమంది కామెంట్స్ వేస్తున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీ లో హీరోయిన్ల కొరత భారీగా ఉంది. ముగ్గురు , నలుగురు తప్ప మరొకరు లేరు.అందరు హీరోయిన్లు వారినే కోరుకుంటున్నారు. రష్మిక , పూజా హగ్దే ఈ ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ధమాకా తో శ్రీ లీల బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం తో దర్శక , నిర్మాతలు ఈమె వెంటపడుతున్నారు. రవితేజ – శ్రీలీల జంటగా తెరకెక్కిన ధమాకా మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. ముఖ్యంగా శ్రీలీల డాన్స్ కు ఫిదా అవుతున్నారు. మొన్నటి వరకు హీరోయిన్లలో డాన్స్ చేయాలంటే సాయి పల్లవి అనే వారు కానీ ఇప్పుడు ధమాకా లో శ్రీలీల డాన్స్ చూసి సాయి పల్లవి ..శ్రీలీల ముందు ఎందుకు పనికిరాదని కామెంట్స్ చేస్తున్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లిసందD’ మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రీలీల. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌కు జోడీగా నటించింది. స్క్రీన్ ప్రజెన్స్‌, డ్యాన్స్‌ గ్రేస్‌తో ఆకట్టుకున్న భామ.. మొదటి సినిమాలోనే తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని రవితేజ సరసన ధమాకా లో నటించింది. ఇక ఈ మూవీ చూసిన వారంతా ధమాకా సక్సె‌స్‌లో శ్రీలీలకు చాల క్రెడిట్ ఇస్తున్నారు. వాస్తవానికి సినిమా సక్సెస్ లో శ్రీ లీల ప్రాధాన్యత కూడా గట్టిగాన్ ఉంది. ఇటు గ్లామర్ తో , అటు డాన్సులతో యూత్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు దర్శక , నిర్మాతల కళ్లు ఈమె పైనే ఉన్నాయి. సీనియర్ హీరోల దగ్గరి నుండి యంగ్ హీరోల వరకు కూడా ఈమె జపమే చేస్తున్నారు. ఈ భామ సైతం కాస్త క్రేజ్ ఉన్న హీరో పక్కనే జోడి కట్టేందుకు ఓకే చెపుతోందట. మొత్తం మీద పవర్ స్టార్ పక్కన శ్రీ లీల అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

follow us