తన మూడు పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చిన పవన్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కు ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేయగా..తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మంగళవారం ఈ ఎపిసోడ్ కు సంబదించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో పూర్తి అయ్యింది. పవన్ – బాలకృష్ణ లు ఫస్ట్ టైం టాక్ షో లో పాల్గొనడం తో ఈ ఎపిసోడ్ ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ షో లో పవన్ కళ్యాణ్ కు సంబదించిన పర్సనల్ విషయాలు , సినీ , రాజకీయాలకు సంబదించిన ఎన్నో ప్రశ్నలు బాలకృష్ణ అడిగి..పవన్ నుండి సమాదానాలు రాబట్టినట్లు తెలుస్తుంది.
ముందుగా బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్ ను మూడు పెళ్లిలా ప్రస్తావన తీసుకొచ్చాడట..’ఈ పెళ్లిళ్ల గోల ఏంటయ్యా’ అని అడిగాడని..అప్పుడు పవన్ కళ్యాణ్ తాను మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరణఇచ్చాడట..అదంతా విన్న తర్వాత బాలకృష్ణ ‘ఇంత క్లారిటీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కామెంట్స్ చేసారంటే వాళ్ళు ఊరకుక్కలతో సమానం’ అంటూ ఆయన వైసీపీ పార్టీ నాయకులపై పరోక్షంగా విమర్శలు గుప్పించినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ హాజరయ్యాడు. అలాగే మధ్య హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ కూడా హాజరయ్యాడట. ఆ తర్వాత ఫోన్ కాల్ లో రామ్ చరణ్ మరియు త్రివిక్రమ్ తో మాట్లాడుతాడు పవన్ కళ్యాణ్..కొసమెరుపు ఏమిటంటే చివర్లో బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ ఎపిసోడ్ మధ్యలో వచ్చి పవన్ కళ్యాణ్ తో ఫోటో తీసుకొని వెళ్లాడని..ఇది ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని..అలా ఆద్యంతం ఆసిక్తికరంగా మరియు వినోదభరితంగా ఈ ఎపిసోడ్ సాగిపోయిందని అంటున్నారు.