అప్పటివరకు షూటింగ్ లకు దూరంగా పవన్ కళ్యాణ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడం తో పవన్ తన ఫామ్ హౌస్ లోనే పర్సనల్ డాక్టర్ ల ఆధ్వర్యంలో చికిత్స తీసుకున్నారు. దాంతో త్వరలోనే కరోనా ను జయించారు. అయితే పవన్ కళ్యాణ్ కరోనా నుండి కొలుకున్నప్పటికీ కరోనా తర్వాత వచ్చే సమస్యలతో బాధపడుతున్నారట. దాంతో ఆయన ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్నారట. అంతే కాకుండా జూన్ వరకు పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోబుతున్నారని సమాచారం.
దాంతో ప్రస్తుతం ఆయన నటిస్తున్న అయ్యప్పనుమ్ కొషియం రీమేక్, హరి హరి వీరమల్లు షూటింగ్ లు జూన్ వరకు వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పవన్ రెస్ట్ తీసుకుంటూనే జనసేన నేతలతో ఆన్లైన్ మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పవన్ ప్రస్తుతం కరోనా పరిస్థితులను కూడా పరీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితులపై ఆయన స్పందిస్తున్నారు.