ప‌వ‌న్ క‌ల్యాణ్ కు క‌రోనా పాజిటివ్..!

pawan kalyan tests corona positive
pawan kalyan tests corona positive

క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు అధికారులు సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్టటికే ప‌లువురు సినీ ప్రముఖులు క‌రోనా బారిన ప‌డి చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని జ‌న‌సేన అధికారికంగా ప్ర‌క‌టించింది. తిరుప‌తి స‌భ అనంత‌రం ఆయ‌న‌కు కొంత అల‌స‌ట అనిపించింద‌ని క‌రోనా టెస్ట్ చేసుకోగా నెగిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. కానీ డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు ఆయ‌న ఫాం హౌస్ లో ఉన్నార‌ని పేర్కొన్నారు.

అయితే రెండు రోజుల నుండి జ్వ‌రం ఒల్లు నొప్పుల‌తో బాధ‌ప‌డుతుండ‌టంతో ప‌రీక్ష చేయించుకోగా క‌రోనా పాజిటివ్ వచ్చింద‌ని తెలిపారు. అంతే కాకుండా ఆయ‌కు ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్ష‌న్ కూడా ఉంద‌ని వైద్యులు గుర్తించిన‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని…ప్ర‌స్తుతం ఖ‌మ్మం కు చెందిన వైద్య నిపుణులు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నార‌ని చెప్పారు. అంతే కాకుండా అపోలో కు చెందిన ఓ వైద్య బృంధం ఫాం హౌస్ కు వెళ్లి ప‌రీక్షించింద‌ని తెలిపారు. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్,ఉపాస‌న‌, చిరంజీవి, ప‌వ‌న్ ఆరోగ్యం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నాని పేర్కొన్నారు.