వకీల్ సాబ్ కు పవన్ భారీ రెమ్యునరేషన్..నిజమెంత.?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెమునరేషన్ విషయంలో కొద్దిరోజుల నుండి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పవన్ అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటూ గుసగుసలు వినిపించాయి. ఒక్కో రోజుకు ఒక్కో కోటి రెమ్యనరేషన్ పుచ్చుకుంటున్నారని గాసిప్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు పవన్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని అంతే కాకుండా లాభాల్లో వాటా కింద మరో పదిహేను కోట్లు పుచ్చుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ మరియు ఆయన కలెక్షన్ల స్టామినా కు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ వకీల్ సాబ్ సినిమాకు లాభాలు వచ్చినట్టు నిర్మాతలు ఎక్కడా వెళ్లడించలేదు. అంతే కాకుండా ఈ సినిమా కలెక్షన్లపై ఊహాగానాలు తప్ప కలెక్షన్ల వివరాలు భయటకు తెలియవు. కాబట్టి పవన్ కల్యాణ్ లాభాల్లో వాటా తీసుకోవడం అనేది వట్టి గాసిప్ మాత్రమేనని అర్థం అవుతుంది.