పే పర్ వ్యూ పద్దతిలో వకీల్ సాబ్ విడుదల

పే పర్ వ్యూ  పద్దతిలో వకీల్ సాబ్ విడుదల

దేశవ్యాప్తంగా కరోనా కారణంగా సినిమా థియేటర్స్ మూత పడటంతో రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాలు మొత్తం మరోదారి లేక ఓటీటీ వైపు అడుగులు వెస్తున్నాయి. తెలుగు సినిమా నిర్మాతలకు విదేశీ మార్కెట్ చాలా ముఖ్యం కానీ ఇప్పుడు అక్కడ కరోనా విజృంభణతో థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేపరిస్థితి కనపడటం లేదు. ఇండియా లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి ఓటీటీ ఛానెల్స్ రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. నాని నటించిన వి చిత్రం, అనుష్క నటించిన లేడి ఓరియెంటెడ్ మూవీ నిశబ్దం సినిమాలు అమెజాన్ లో విడుదల అయ్యీ ఫ్లాప్ టాక్ ను దక్కించుకోవడంతో అమెజాన్ కు భారీ నష్టం కలిగింది. ఈ నష్టంను వారే భరిస్తున్నారు.

చిత్రా నిర్మాతలు OTT ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పే పర్ వ్యూ రిలీజ్‌ని పరిశీలిస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన “వకీల్ సాబ్”, చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం గా ఉన్నది. ఓవర్సీస్ లో ఈ చిత్రంకు డిమాండ్ ఎక్కువ కావున పే పర్ వ్యూ ద్వారా విడుదల చెయ్యాలని నిర్మాత దిల్ రాజ్ ప్లాన్ చేస్తున్నాడు. ఓటిటీ లో ఈ చిత్రం ను పే పర్ వ్యూ, సదరు ఓటిటీ సంస్థతో చర్చలు జరుగుతున్నాయి. ఓవర్సీస్ లో ప్రాంతాన్ని బట్టి టికెట్ రేట్ నిర్ణయిస్తారు. అంటే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్ వంటి దేశాల్లో పే పర్ వ్యూ యొక్క రేట్ మారుతుంది.

follow us