‘వకీల్ సాబ్’ టీజర్ టాక్

  • Written By: Last Updated:
‘వకీల్ సాబ్’ టీజర్ టాక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి వకీల్ పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు ఈ చిత్రంలో కొన్ని కీలక మార్పులు చేసారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్ .. తన దైన శైలిలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పెన్నుతో టిక్ టిక్ అనిపించడం.. చేతి వాచ్‌‌ను స్టైలిష్‌గా ఆయుధంగా వాడటం.. అంతేకాదు కోర్టులో వాదించడం తెలుసు.. కోర్టు తీసి కొట్టడం తెలుసు అంటూ మెట్రో రైలులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఫ్యాన్స్ చేత కెవ్వు కేక పుట్టించేలా ఉన్నాయి. చివర్లో ఇళ్లు ఖాళీ వెళ్లే సమయంలో గడ్డం లుక్‌లో పవన్ కళ్యాణ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఆశించే అన్ని హంగులతో ‘వకీల్ సాబ్’ ఉండబోతున్నట్టు అర్ధమవుతోంది.

follow us