వకీల్ సాబ్ ‘టీజర్’ అప్డేట్ ?

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన పింక్ సినిమాను తెలుగులో పవన్ ఇమేజ్ కు తగ్గట్లు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. ఎంసిఏ తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీజర్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. అప్పట్లో దసరాకు వస్తుందని దర్శక నిర్మాతలు చెప్పినా అది నిలబెట్టుకోలేదు.
దసరాతో పాటు దివాళి, క్రిస్మస్ వెళ్లిపోయినా ఇప్పటికీ టీజర్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ వచ్చేస్తుందని ప్రచారం జరుగుతుంది. జనవరి 1న, 2021 టీజర్ విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారు వకీల్ సాబ్ యూనిట్. ఆ విషయంపై నేడో రేపో క్లారిటీ రానుంది.
పింక్ కథ ఇప్పుడు పవన్ ఇమేజ్ కు కూడా సూట్ అవుతుందని నమ్ముతున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, నివేథా థామస్, అనన్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మగువ మగువ పాట మంచి ఆదరణ దక్కించుకుంది.