‘హరి హర వీర మల్లు’ నుండి పవన్ నయా లుక్ వైరల్

‘హరి హర వీర మల్లు’ నుండి పవన్ నయా లుక్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’. గమ్యం ఫేమ్ క్రిష్ డైరెక్షన్లో ఏ ఏం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సెట్స్ ఫైకి వచ్చి చాలా నెలలే కావొస్తున్నా మధ్య లో వేరే సినిమాలకు పవన్ ఓకే చెప్పడం..జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీ అవుతుండడం తో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది. ఈ తరుణంలో షూటింగ్ లోని పవన్ లుక్ బయటకు వచ్చి వైరల్ గా మారింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా 900 మంది టీమ్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌ను పోషిస్తున్నారు. అందులో ప‌వ‌న్ పోరాట యోధుడిగా క‌నిపిస్తున్నారు. త‌న లుక్‌కి సంబంధించిన ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజైన ప‌వ‌న్ లుక్ టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. జనవరి రెండు , మూడో వారంకల్లా షూటింగ్ పూర్తి చేసి , సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌గా మ‌రో హీరోయిన్‌గా న‌ర్గీస్ ఫ‌క్రీ క‌నిపించ‌నుంది. మొఘ‌ల్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో ఔరంగ‌జేబు పాత్ర కూడా క‌నిపించ‌నుంది. ఆ పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ న‌టిస్తున్నార‌ని స‌మాచారం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

follow us