న్యూ ఇయర్ కు థియేటర్స్ లలో పవన్ సందడి

న్యూ ఇయర్ కు థియేటర్స్ లలో పవన్ సందడి

న్యూ ఇయర్ సందర్బంగా థియేటర్స్ లలో పవన్ మేనియా కొనసాగబోతుంది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా రీ రిలీజ్ చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – భూమిక జంటగా ఎస్.జె.సూర్య డైరెక్షన్లో ఏ ఎం రత్నం నిర్మాణంలో 2001 వచ్చిన మూవీ ఖుషి.

ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. యూత్ ను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు ఓ ట్రేడ్ సెట్ చేసిన మూవీ ఇది. అలాంటి ఈ మూవీ 4k వెర్షన్‌ గా డిసెంబర్ 31 న విడుదల కాబోతుంది. జనవరి 6వరకూ థియేటర్లో ఉంటుంది. ఇప్పటికే దీనికి 4కె వెర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా రీ -రిలీజ్ థియేట్రికల్ రైట్స్ మూడు కోట్ల వరకు అమ్ముడు పోయినట్టుగా సమాచారం. ఇక ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ ఆలస్యమైనప్పయికి ఖుషి తో అభిమానులు సంబరాలు చేసుకోవడం ఖాయం.

follow us