పవన్ తో త్రివిక్రమ్ రావడం లేదట..తేజ్ వస్తున్నాడట

పవన్ తో త్రివిక్రమ్ రావడం లేదట..తేజ్ వస్తున్నాడట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కలిసి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 కు రాబోతున్నారని..నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో త్రివిక్రమ్ కు బదులు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వస్తున్నట్లు తెలుస్తుంది.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ ముంగిపు కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సీజన్ ముగింపు ఎపిసోడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని , పవన్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరు అవుతారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం తో ఈ ఎపిసోడ్ ఫై అందరిలో ఆసక్తి నెలకోని ఉంది.

ఈరోజు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది..ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొంటాడు అని అందరూ అనుకున్నారు..కానీ చివరి నిమిషం లో ఏమి జరిగిందో తెలియదు కానీ ఆయన బదులుగా పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ ని వీక్షించేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ కి వేలాది సంఖ్య లో చేరారు..పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అని తెలుకున్న అభిమానులు తెల్లవారుజాము నుండే అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట పడిగాపులు కాయడం ప్రారంభించారు.

follow us