జనవరి 13న పవన్ అన్‌స్టాబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ..?

జనవరి 13న పవన్ అన్‌స్టాబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ..?

పవన్ కళ్యాణ్ అన్‌స్టాబుల్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 13 న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ 2 కు ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓ టాక్ షో కు హాజరు కావడం..అది కూడా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షో కు రావడం తో అందరిలో అంచనాలు పెరిగాయి. ఈ షో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని యావత్ అబిమానాలోకం ఎదురుచూస్తుంది. ఈ షో షూటింగ్ కూడా చాల గ్రాండ్ గా జరిగింది.

ఓ భారీ మూవీ ఓపెనింగ్ జరిగితే ఎలా ఉంటుందో అంతకు మించి అనేలా ఈ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. నందమూరి , మెగా అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో కు చేరుకొని తమ అభిమాన హీరోలకు గ్రాండ్ వెల్ కం చెప్పారు. అంతే కాదు షో పూర్తి అయ్యేవరకు కూడా అక్కడే ఉండి, షో ఎలా జరిగిందనేది తెలుసుకున్నారు. ఇక ఈ షో కు సంబదించిన చాల విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. షో లో బాలకృష్ణ తో కలిసి పవన్ తొడ కొట్టారని , అలాగే బాలయ్య చరణ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాడని , సాయిధరమ్‌ తేజ్‌ ఎపిసోడ్‌ మధ్యలో వచ్చాడని , డైరెక్టర్స్ త్రివిక్రమ్‌, క్రిష్‌ లు కూడా ఇంటర్వ్యూ మధ్యలో జాయిన్ అయ్యారని .. ఇక లాస్ట్ లో హైలైట్ గా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సడెన్ ఎంట్రీ ఇవ్వడం.. స్టేజ్‌ మీద పవన్‌ కల్యాణ్‌తో ఫొటో దిగడం వంటివి హైలైట్ గా ఉన్నాయనే విషయాలు బయటకు వచ్చాయి. ఈ విషయాలు అన్ని తెలిసి సాధారణ ప్రేక్షకుడు సైతం ఎపిసోడ్ ను చూడాలనే ఆత్రుత తో ఉన్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ ఎపిసోడ్‌ను సంక్రాంతి కానుకగా అదే రోజున ప్రదర్శించేందుకు ఆహా టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ పవర్‌ఫుల్ ఎపిసోడ్ జనవరి 13న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అవుతుంది. అంతే కాదు మొన్న ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే ముందు యూజర్ ట్రాఫిక్ తట్టుకోలేక ఆహా యాప్ క్రాష్ అయినా సంగతి తెలిసిందే. ఇక పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహా చూసుకుంటుంది.

follow us