నాగ్ సినిమాలో పాయల్ స్పెషల్ సాంగ్.. !

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చాత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఈ సినిమా తరవాత నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు రీమేక్ గా వస్తున్న బంగార్రాజు చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు కూడా కల్యాణ్ కల్యాణ్ కృష్న దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నాగర్జున ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం బంగార్రాజు కోసం ఆన్లైన్ ద్వారా వీడియో కాల్స్ లో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగాఈ సినిమాపై రకరకాల వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య, అఖిల్, సమంత లు కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అంతే కాకుండా నాగ్ తాత అని చైతూకు అకిల్ కొడుకుగా నటించబోతున్నారని గుసగులు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. బంగార్రాజు సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేసారట మేకర్స్. అంతే కాకుండా పాయల్ ను కూడా ఇందుకోసం సంప్రదించారట. ఇక పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మన్మడితో స్టెప్పులు వేయడం పక్కా. అంతే కాకుండా ఇప్పటికే ఆ స్పెషల్ సాంగ్ ను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారట. చూడాలి మరి బంగార్రాజు సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో.