ఆహా లో సినిమాలను పైరసీ చేసే ప్రయత్నం…

సినిమాల పై పైరసీ అడ్డుకునే ప్రయత్నంఎప్పటినుండి జరుగుతూనే ఉంది, హీరో , హీరోయిన్లు , ప్రొడ్యూసర్లు ప్రతి సినిమా రిలీజ్ కి ముందు బలంగా వినిపించే మాట పైరసీ ని చూడవద్దు , ఎంకరేజ్ చేయవద్దని చెప్తూనే ఉన్నారు, కానీ పైరసీ ని ఆపలేకపోతున్నారు. కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటంతో చిన్న సినిమాలు అన్నీ ఓటీటీవైపే చూస్తున్నాయి.
అయితే తెలుగు లో ఉన్న ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా , ఆహా లోని సినిమాలను కూడా పైరసీ చేసే ప్రయత్నం జరిగింది. జనగామ, జగిత్యాలలో ఇద్దరిని పైరసీ చేయడానికి ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసారు, మూవీలను డౌన్‌లోడ్ చేసి తన కేబుల్ నెట్ వర్క్‌లో ప్రసారం చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. వీరిని కాపీ రైట్ చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేసారు, జగిత్యాలలో కూడా ఎటువంటి ప్రయత్నం జరగ్గా అక్కడ నెట్‌వర్క్ కంప్యూటర్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.