మానవ సంబంధాలను సహజంగా చూపిస్తున్న “పిట్ట కథలు”..!

  • Written By: Last Updated:
మానవ సంబంధాలను సహజంగా చూపిస్తున్న “పిట్ట కథలు”..!

తెలుగు ఓటీటీ లో వస్తున్న మొదటి ఆంతాలజీ “పిట్ట కథలు”. ఈ సిరీస్ ను నలుగురు టాలీవుడ్ దర్శకులు తెరకెక్కించారు. ఈ సిరీస్లో శృతి హాసన్, సత్య దేవ్, ఇషారెబ్బ, మంచు లక్ష్మి, జగపతిబాబు, అమలా పాల్, శాన్వి మేఘన, అభి కీలక పాత్రల్లో నటించారు. ఈ ఆంతాలజినీ హిందీలో సూపర్ హిట్ అయ్యిన లస్ట్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుతోంది. సిరీస్ లో రాముల క్యారెక్టర్ ను తరుణ్ భాస్కర్, మీరా కథను నందిని రెడ్డి, శృతిహాసన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఎక్స్ లైఫ్ కథను నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు.

ఇక సత్యదేవ్ ఇషా రెబ్బా కథ “పింకీ”ని సంకల్ప్ రెడ్డి తెరకెక్కించారు. ఇదిలా ఉండగా ఈ సిరీస్ ట్రైలర్ ను నెట్ఫ్లిక్స్ నేడు విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే మానవ సంబంధాలను సహజంగా చూపించబోతునట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళల సాధికారత..మహిళల సమస్యలను సిరీస్ ద్వారా చూపించబోతునట్టు కనిపిస్తోంది. షరా మామూలుగానే ఓటీటీ లో రొమాన్స్ డోస్ ఎక్కువగా ఉన్నట్టు ఈ సిరీస్ లోనూ కనిపిస్తోంది. ఇక ఈ తొలి తెలుగు ఆంతాలజీ ఫిబ్రవరి 19న 190 దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది.

follow us