21 రోజులు దేశమంతా లాక్ డౌన్ : నరేంద్ర మోడీ

కరొనను మట్టుపెట్టడానికి భారత్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.. దానిలో భాగంగా ఈ రోజు నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ పెట్టారు.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు..

ఈ అర్ధరాత్రి నుంచి ప్రజలు అందరూ ఇంట్లోనే ఉండాలి..  బయటకి రాకూడదు అని నరేంద్ర మోడీ ఆదేశించారు.. కరోనా వచ్చిన వ్యక్తి కొన్ని రోజులు సాధారంగానే ఉంటాడని దాని వల్ల ఆ వ్యక్తి జనాలలో తిరిగితే అది మిగితా వాళ్ళకి వచ్చే ప్రమాదం లేక పోలేదు.. ఆ వ్యాప్తిని  అంతు ముట్టించడానికి 21 రోజులు హోమ్ క్వరంటాయిన్ తప్పదు..

ఇది మనం ఫాలో అవ్వక పోతే దేశం 21 ఏళ్ళు వెనకకి వెళ్లి పోతుంది.. దాని కన్నా మనం ఇంట్లోనే ఉండడం మెరుగు.. దయచేసి ఇంట్లోనే ఉండండి అని దేశ ప్రజలను రెండో సారి వేడుకున్నారు ప్రధాని..

అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.. నిత్యావసరాలు ప్రజలకు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా శ్రమిస్తాయి అని చెప్పారు. ఇప్పటికే ఇండియా లో 532 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. వీళ్ళ దగ్గర నుంచి అది వేగంగా వ్యాప్తి చెందుతుంది.. ఇది అరికట్టించాలి అంటే మనం ఈ 21 రోజులు ఇంట్లోనే ఉండక తప్పదు..

21 రోజులు ఇంట్లో ఉండి దేశాన్ని కాపాడండి. దేశాన్ని కాపాడం ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది.. కరోనా వైరస్ తో చేసే యుద్ధం లో ప్రభుత్వం చెప్పినవి పాటిస్తే మనం కరొనాను జయిస్తాం..