రష్మిక కోసం ‘పొగరు’కు భారీగా పెట్టారు !

రష్మిక కోసం ‘పొగరు’కు భారీగా పెట్టారు !

కన్నడ దర్శకుడు నంద కిశోర్ దర్శకత్వంలో ధృవ్ షార్జ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం పొగరు. శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్ పై బి.కే. గంగాధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కన్నడ, తెలుగు బాషల్లో ఈ చిత్రం నిర్మితమవుతుంది. ఇటీవల ఈ చిత్రం నుండి కరాబు అనే సాంగ్ విడుదలై మంచి వ్యూస్ ను రాబట్టింది.

ఈ సాంగ్ లో రష్మిక ను ఎడిపిస్తూ హీరో వెంటపడుతుంటాడు. చాలా వైలెంట్ తో కూడి ఉండటంతో అక్కడి మహిళా సంఘాలు ఆ పాటను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాట అక్కడ పెద్ద దుమారమే లేపింది. తెలుగులోను కరాబు సాంగ్ కు మంచి ఆధారణ లభించింది. ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులను డి. ప్రతాప్ రాజ్ 3.30 cr కి దక్కించుకున్నాడు.

తెలుగులో నటుడి గా గుర్తింపు లేని ధృవ్ కు ఇది పెద్ద అమౌంటే.. కానీ రష్మిక నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ధృవ్ తెలుగు నాట పరిచయం లేని వ్యక్తి కానీ అతని నటనను తెలుగు ప్రేక్షకులు అధరిస్తారనే నమ్మకంతో తెలుగు బాషలో డబ్ చేస్తున్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప అనే చిత్రంలో నటిస్తుంది.

follow us