జబర్దస్త్ కార్తీక్ పై కిడ్నాప్ కేస్ !

జబర్దస్త్ కార్తీక్ పై కిడ్నాప్ కేస్ !

ఈ‌టి‌వి లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ను ప్రేక్షకులు ఎంతగా ఆధారిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో హీరోలకు, కమెడియన్స్ కి ఫ్యాన్స్ ఉండటం చూశాం కానీ బుల్లి తెరపై వచ్చే జబర్దస్త్ కమెడియన్స్ కూడా జనాల్లో ఫుల్ ఫాల్లోఇంగ్ ఉంది. ఆ రేంజ్ లో వీళ్ళ స్కిట్స్ ఉంటాయి. అదే రేంజ్ లో వివాదాలను మోసుకు వస్తుంటారు. నాగబాబు జబర్దస్త్ కి హోస్ట్ గా చేస్తున్న సమయంలో కమెడియన్ వేణు చేసిన ఓ స్కిట్ వివాదమై అతని పై ఓ వర్గంకు చెందిన వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే…. హైపర్ అది పంచు వేస్తే ఎలా ఉంటుందో మనందరికి బాగా తెలుసు. టాలీవుడ్ స్టార్ హీరో పై వేసిన సెటైర్ పంచులకి ఆయన ఫ్యాన్స్ సినిమా సంబందించిన వ్యక్తులు అది పై పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు .

ఇక తాజాగా “కెవ్వు కార్తీక్” తన సొంత బావను కిడ్నాప్, దాడి చేసిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశం గా మారింది. భూపతి పేటలో నివాసం ఉంటున్న తన బావ “రవికుమార్” పై కెవ్వు కార్తీక్ తన అనుచరులతో కలిసి వచ్చి కార్ లో ఎక్కించుకుని 15 కిలోమీటర్ల వరకు తీసుకువెళ్లి తన తో పాటు వచ్చిన వ్యక్తులతో దాడి చేశాడని బాధితుడు రవి కుమార్ గూడూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాధు చేశాడు. ఎస్‌ఐ సురేశ్ నాయక్ మాట్లాడుతూ.. కెవ్వు కార్తీక్ పై ఆయన వెంట వచ్చిన వ్యక్తులపైన, వారి తల్లిదండ్రులపైనా పలు సెక్షన్స్ కింద కేస్ నమోదు చేసినట్లుగా తెలిపాడు. ముక్కు అవినాష్ జబర్దస్త్ ను వీడి బిగ్ బాస్ షో కి వెళ్లడంతో కార్తీక్ ఒక్కడే అన్నీ తానై స్కిట్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక కిడ్నాప్ విషయమై కార్తీక్ నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు.

follow us