వైస్ జగన్ పై రాళ్లు పడకుండా వలలతో…

CM YS Jagan Secretariat Visit
CM YS Jagan Secretariat Visit

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి రైతులు ఆందోళనలను 21వ రోజు కు చేరాయి. అమరావతి రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు వేర్వేరు రూపాల్లో ఉధృతమౌతున్నాయి.

రాజధాని కోసం భూములను ఇచ్చిన 29 గ్రామాల ప్రజలు బంద్ ను పాటించారు. అయితే 29 గ్రామాలలో ఒక గ్రామం అయిన మందడం పోలీసుల ఆంక్షలతో నిర్మానుష్యంగా మారింది. ముఖ్యమంత్రి వైస్ జగన్ సచివాలయానికి గ్రామంలో ఆంక్షలతో పాటు ప్రతి ఇంటి ముందు ఇద్దరు పోలీసులు వలల్తో నిల్చున్నారు. ముఖ్యమంత్రి వెళ్లే వరకు ఎవరు బయటికి రాకూడదు అని అలాగే ఎవరు అయినా రాళ్ళూ రువ్వకుండా , రువ్విన వాటిని అల వలల్తో పట్టుకోవడానికి ఏర్పాటులు చేసుకున్నారు .