సంక్రాంతి బరిలో వచ్చే చిత్రాల రన్ టైం ఎంతంటే..

సంక్రాంతి బరిలో వచ్చే చిత్రాల రన్ టైం ఎంతంటే..

2023 సంక్రాంతి బరి మాములుగా ఉండడం లేదు. మెగా , నందమూరి హీరోలతో పాటు తమిళ్ హీరోలు , ఓ చిన్న హీరో పోటీ పడుతున్నారు. ఈ ఐదు సినిమాల ఫై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ నాల్గు సినిమాలు ఏంటి..? వాటి రన్ టైం ఎంత..? అనేది ఇప్పుడు చూద్దాం.

నందమూరి బాలకృష్ణ – క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కిన వీర సింహ రెడ్డిమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 35 నిమిషాలు ఉండబోతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

మెగాస్త్ర చిరంజీవి – శృతి హాసన్ జంటగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య మూవీ 2 గంటల 40 నిమిషాలుగా రన్ టైం గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ సినిమా ఫై అంచనాలు పెంచగా..రవితేజ ప్రత్యేక రోల్ లో నటిస్తుండడం తో సినీ లవర్స్ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక తమిళ్ హీరో విజయ్ నటించిన వారసుడు మూవీ జనవరి 12 న తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా..దిల్ రాజు నిర్మించారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర రన్ టైం వచ్చేసి 2 గంటల 43 నిమిషాల నిడివి తో రాబోతుంది.

అజిత్ నటించిన తెగింపు సినిమా తమిళం తో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా 2 గంటల 23 నిమిషాల నిడివితో రాబోతోంది. హెచ్ వినోద్ డైరెక్ట్ చేయగా తెలుగు లో నిర్మాత దిల్ రాజు నైజం , వైజాగ్ ఏరియాలలో రిలీజ్ చేయబోతున్నారు.

వీటితో పాటు యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న “కళ్యాణం కమనీయం” జనవరి 14 న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. ఈ చిత్ర రన్ టైం వచ్చేసి 2 గంటల 10 నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద సంక్రాంతి బరిలో వచ్చే అన్ని చిత్రాలు ఆసక్తి రేపుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో చూడాలి.

follow us