కేక పుట్టిస్తున్న బుట్టబొమ్మ న్యూ లుక్

కేక పుట్టిస్తున్న బుట్టబొమ్మ న్యూ లుక్

కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించుకున్న పూజా హగ్దే..ఆ తర్వాత డీజే మూవీ తో సూపర్ హిట్ అందుకొని వెనుకకు చూసుకోవాల్సిన పనిలేదు అనే రీతిలో స్టార్ హీరోయిన్ అయ్యింది. తెలుగు ,తమిళ్ , హిందీ వంటి భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. కాకాపైతే ఈ ఏడాది అమ్మడికి వరుస ప్లాప్స్ షాక్ ఇచ్చాయి.

‘రాధేశ్యామ్’..’బీస్ట్’..’ఆచార్య’ అన్నీ డిజాస్టర్ ఖాతాలోనే పడ్డాయి. ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. చేతిలో అవకాశాలైతే బాగానే ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా అమ్మడి న్యూ లుక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మహేష్ మూవీ కోసమే ఈ భామ ఎంత అందంగా తయారైందని అంటున్నారు.

follow us