పూజా హగ్దే ‘సీక్రెట్ శాంటా’

పూజా హగ్దే  ‘సీక్రెట్ శాంటా’

పూజా హగ్దే ‘సీక్రెట్ శాంటా’ రివీల్ చేసింది. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించుకున్న పూజా హగ్దే..ఆ తర్వాత డీజే మూవీ తో సూపర్ హిట్ అందుకొని వెనుకకు చూసుకోవాల్సిన పనిలేదు అనే రీతిలో స్టార్ హీరోయిన్ అయ్యింది. తెలుగు ,తమిళ్ , హిందీ వంటి భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. కాకాపైతే ఈ ఏడాది అమ్మడికి వరుస ప్లాప్స్ షాక్ ఇచ్చాయి.

‘రాధేశ్యామ్’..’బీస్ట్’..’ఆచార్య’..‘సర్కస్’ అన్నీ డిజాస్టర్ ఖాతాలోనే పడ్డాయి. అయినాగానీ అమ్మడు మాత్రం ఏమాత్రం నిరాశపడకుండా సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంది. తాజాగా ఓ కొత్త ఫోటో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేయడం తో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ ఫోటో లో టాప్ టూ బాటమ్ ఎరుపు రంగులో ఉండగా.. ఆ నడుము అందాల్ని బకెల్ తో బంధీని చేసి ..ఆ రెండింటి మధ్య ఓ ముడి వేసి సమ్ థింగ్ స్పెషల్ గా ఉంది. అంతే కాదు ఈ ఫోటోకి ‘సీక్రెట్ శాంటా’ అంటూ ఓక్యాప్షన్ ను రాసుకొచ్చింది. అంటే క్రిస్మస్ సందర్భంగా ఈ డ్రెస్ వేసుకున్నట్లు ఉందని అంత అనుకుంటున్నారు.

follow us