పూనమ్ కూడా జబ్బు బారినపడిందట..

పూనమ్ కూడా జబ్బు బారినపడిందట..

ఈ మధ్య సినీ తారలంతా ప్రాణాంతకమైన జబ్బుల బారినపడుతున్నారు. గతంలో వారు పలు జబ్బుల బారినపడిన బయటకు చెప్పేవారు కాదు..కానీ ఇప్పుడు ధైర్యం గా చెపుతూ వస్తున్నారు. ఆ మధ్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధి బారినపడినట్లు తెలిపి అందరికి షాక్ ఇవ్వగా..ఆ తర్వాత కల్పికా గణేష్‌ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. వీరు మాత్రమే కాదు పూనమ్ కౌర్ కూడా ఫైబ్రో మైయాల్జియా అనే ఓ అరుదైన జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది. రెండేళ్లుగా పూనమ్ ఈ వ్యాధి తో బాధపడుతుందట. ఈ వ్యాధి తగ్గడానికి కేరళలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. తన ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు కొన్నిసోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఈ వ్యాధి వల్ల అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి వంటి పలు ఇబ్బందులు వస్తాయని పూనమ్‌ చెప్పుకొచ్చింది. ఈ వ్యాధి తగ్గడానికి కేరళలోని ఆయుర్వేద నిపుణులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారట. మొదట తన జబ్బుకు చికిత్స కోసం పలు ఆస్పత్రులు తిరిగిందట కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం తో కేరళ ఆయుర్వేద వైద్యులను సంప్రదించిందట. వారు ఆమెను పరిశీలించి ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన జబ్బు ఉన్నట్లు తేల్చారట. ప్రస్తుతం కేరళలోనే ఉంటూ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటుంది.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే..2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం తో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. అటుతరువాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్ , శౌర్యం, నాగవల్లి , నాయకి మొదలుగు సినిమాలు చేసింది. సినిమాల వల్ల పెద్దగా పాపులర్ కాలేదు కానీ పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ వల్ల అమ్మడు చాల ఫేమస్ అయ్యింది.

follow us