బాలయ్య తో ప్రభాస్ సందడి మాములుగా ఉండదు

బాలయ్య తో ప్రభాస్ సందడి మాములుగా ఉండదు

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ జరుపుకుంటుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు.

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ హాజరయ్యారు. దీనికి సంబదించిన పిక్స్ ను ఆహా ట్విట్టర్ వేదికగా తెలిపింది. బాలయ్యతో ప్రభాస్ తొలిసారి తెరపై కనిపించబోతున్నారు. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ప్రకటించింది. బాలయ్య, ప్రభాస్, గోపీచంద్ చిత్రీకరణలో పాల్గొన్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రభాస్, బాలయ్య ఒకే స్టేజ్, ఫ్రేమ్ లోకి వచ్చిన విషయాన్ని తాము ఇంకా నమ్మలేకపోతున్నామని ట్వీట్ చేసింది. ‘మీరు ఎన్నడూ చూడని ఒక కొత్త యాంగిల్ మీకు చూపించే మాసివ్ ఎపిసోడ్ ఇది. త్వరలో మీ ముందుకు వస్తుంది’ అని పేర్కొంది.

మామూలుగానే ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలుస్తుంటాడు. ఇక ప్రభాస్‌ను సైతం అభిమానులు డార్లింగ్ అనే సంబోధిస్తుంటారు. సెలెబ్రిటీలు సైతం ప్రభాస్ అని కాకుండా డార్లింగ్ అని పిలుస్తుంటారు. డార్లింగ్ అనేది ప్రభాస్‌కు ఊత పదంగా మారిన విషయం తెలిసిందే. కానీ బాలయ్యతో అన్ స్టాపబుల్ షో చేస్తున్న సమయంలో రివర్స్ అయింది. బాలయ్యకు ఊతపదంగా మారిందట.

ప్రభాస్‌ను ఎపిసోడ్ మొత్తం డార్లింగ్ అని పిలుస్తూనే ఉన్నాడట. ప్రభాస్, గోపీచంద్‌ల స్నేహాంలోని మరో కోణాన్ని చూపించేలా ఈ ఎపిసోడ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ పెళ్లి గురించి కూడా బాలయ్య కూపీ లాగే ప్రయత్నం చేసినట్టు టాక్. మొత్తానికి ఈ ఎపిసోడ్ వర్కింగ్ స్టిల్సే ఇలా వైరల్ అవుతున్నాయి.

follow us