నెల రోజుల పాటు ప్రభాస్ హాస్పటల్ చుట్టూనే తిరగాడట..

నెల రోజుల పాటు ప్రభాస్ హాస్పటల్ చుట్టూనే తిరగాడట..ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపాడట. 2022 ఏడాది చిత్రసీమను విషాదంలో పడేసింది. ఎంతోమంది దిగ్గజ నటులను చిత్రసీమ కోల్పోయింది. అంతకు ముందు కరోనా కారణంగా పలువుర్ని కోల్పోగా..2022 లో పలు కారణాలతో పలువురు చనిపోయారు. వీరిలో సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణం రాజు , కైకాల సత్యనారాయణ, చలపతి రావు తో పాటు ఎంతోమందిని కోల్పోయింది. కాగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మరణం ప్రభాస్ కుటుంబంలో విషాదం నింపింది. ప్రభాస్ కు అన్ని తానై కృష్ణం రాజు ఉన్నాడు.
2022 సెప్టెంబర్ 11న కృష్ణంరాజు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తనకు జీవితం ఇచ్చిన కృష్ణంరాజు మరణాన్ని జీర్ణించుకోవడం ప్రభాస్ కి కష్టమైంది. దగ్గరుండి ఆయన మరణాంతర కార్యక్రమాలు పూర్తి చేశాడు. కృష్ణంరాజుకు పుట్టి పెరిగిన మొగల్తూరులో సంస్మరణ సభ ఏర్పాటు చేసి భారీగా విందు భోజనం పెట్టాడు. ఈ కార్యక్రమానికి సినీ , రాజకీయ ప్రముఖులు , వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఇప్పుడిప్పుడే పెదనాన్న జ్ఞాపకాల నుండి బయటపడుతున్నాడు. తాజాగా ప్రభాస్ ..బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోలో ఆయన పెదనాన్నను తలచుకొని ఎమోషనల్ అయ్యారు. షోలో కృష్ణంరాజు స్పెషల్ ఏవీ ప్రదర్శించారు. ఆ వీడియో చూశాక ప్రభాస్ మరింత భావోద్వేగానికి గురయ్యారు. ఆయన లేకపోతే నేను లేను. మా జీవితాలు ఇలా ఉండేవి కాదని ప్రభాస్ కన్నీరు పెట్టుకున్నారు.
మా కుటుంబం అంతా ఆయన్ని ఎంతగానో మిస్ అవుతున్నాము. పెదనాన్న చనిపోవడానికి ముందు నెలరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. నేను ఆ నెలరోజులు ఆసుపత్రికి వెళుతూ ఆయన ఆరోగ్యం సమీక్షిస్తూ ఉండేవాడిని. షూటింగ్ లో ఉన్నప్పటికీ డాక్టర్స్ నుండి ఎప్పటికప్పుడూ సమాచారం అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఆయన దూరం కావడం మా జీవితాల్లో అతి పెద్ద లోటు అని ప్రభాస్ ఎమోషనల్ అయ్యారట. ఈ ఎపిసోడ్ జనవరి 06 న స్ట్రీమింగ్ కానుంది.
ప్రస్తుతం ప్రభాస్ నాల్గు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు. ఆదిపురుష్ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా..సలార్ , ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ మూవీస్ సెట్స్ ఫై ఉన్నాయి.