కేజీయఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా !

కేజీయఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చెయ్యాబోతున్నాడని ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ “హోంబలే ఫిల్మ్స్ “డిసెంబర్ 2 న అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని అధికారిక ప్రకటన ఇచ్చేసింది. కేజీయఫ్ దర్శకుడు, ప్రభాస్ ను తరుచూ కలుస్తుండటం తో వీరిద్దరి సినిమా ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

గతంలో పలుసార్లు ప్రభాస్ ను కలిసిన ఫలితం లేకుండా పోయింది. ఎన్‌టి‌ఆర్ కి కూడా కథను వినిపించడం జరిగింది. జక్కన ఆర్ఆర్ఆర్ సినిమా తో తారక్ బిజీగా ఉన్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యాలిసి ఉంది. ఎన్‌టి‌ఆర్ తో ఆలస్యం అయ్యేలా ఉందని భావించిన ప్రశాంత్ మొదట ఎవరితో అనుకున్నాడో అతని వద్దకే అదే కథ తోనే వెళ్ళాడు. ఈసారి ప్రభాస్ ను మెప్పించి ఒప్పించాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నిర్మించనున్నది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా ఎవరిని తీసుకుంటారు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు అగాలిసిందే.

ప్రస్తుతం ప్రభాస్, రాధా కృష్ణ డైరక్షన్ లో “రాధే శ్యామ్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ రాజస్తాన్ లో జరుగుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తరువాత నాగ్ అశ్విన్ తో పాన్ ఇండియా మూవీ చెయ్యాలిసి ఉంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరక్షన్ లో “అధిపురూష్” అనే చిత్రం లైన్ లో ఉంది. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఆ తరువాతనే ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. ప్రస్తుతం కన్నడ రాక్ స్టార్ యష్ తో “కేజీయఫ్ 2” ను చిత్రీకరిస్తున్నాడు.

follow us