ప్రభాస్, ప్రశాంత్ నీల్ “సలార్” .. కేజీయఫ్ ని మించి

ప్రభాస్, ప్రశాంత్ నీల్ “సలార్” .. కేజీయఫ్ ని మించి

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కేజీయఫ్ చిత్రాన్ని నిర్మిస్తున్న హోంబల్ ఫిలింస్ నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని కూడా నిర్మించబోతుందని. అందుకు సంబందించిన ప్రకటన డిసెంబర్ 2 న రాబోతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు డిసెంబర్ 2 రానే వచ్చేసింది. ఆ వార్తలను నిజం చేస్తూ వీరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం యొక్క పోస్టర్ ను “ది మోస్ట్ వైలెంటెడ్ మ్యాన్” “సలార్” అంటూ విడుదల చేశారు.

ప్రభాస్ తుపాకి పై చేయ్యి వేసి డేంజరస్ లూక్స్ తో చూస్తున్నట్లుగా ఉంది. కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన “ఉగ్రం” సినిమాకు రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. 2021 జనవరిలో ప్రభాస్ “సలార్” లోకి అడుగు పెడతాడని చిత్రా యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ డైరెక్షన్ లో “రాధే శ్యామ్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ “కేజీయఫ్ 2” చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు.

follow us