నేడు ప్రారంభమైన ‘సలార్’.. హీరోయిన్ గా ?

  • Written By: Last Updated:
నేడు ప్రారంభమైన ‘సలార్’.. హీరోయిన్ గా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సలార్’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాదులో పూజా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సంచలన విజయాన్ని సాధించిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్, యశ్ ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. సలార్ అంటే ఒక సమర్థవంతమైన నాయకుడని… రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని ప్రశాంత్ నీల్ ఓ సందర్భంలో చెప్పారు. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామను తీసుకోవాలని అనుకున్న ప్రశాంత్ నీల్ బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘దిశా పటాని’ని కన్ఫర్మ్ చేశారని సమాచారం. ఇదే జరిగితే దిశా పటానీకి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ కూడా ‘కేజీఎఫ్ 2’ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు.

follow us