ఆదిపురుష్ అప్డేట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం..దీన్ని ఎవడైనా అప్డేట్ అంటారా .?

  • Written By: Last Updated:
ఆదిపురుష్ అప్డేట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం..దీన్ని ఎవడైనా అప్డేట్ అంటారా .?

బాహుబలి భారీ విజయం తరవాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. వరుస పాన్ ఇండియా సినిమా ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్ లో “రాధే శ్యామ్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పిరియాడికల్ లవ్ స్టొరీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆడిపురుష్” అనే సినిమాలో నటించబోతున్నాడు. సినిమాలో ప్రభాస్ కు విలన్ గా బాలివుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆడిపురుష్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

ఇదిలా ఉండగా ఆదిపురుష్ సినిమా నుండి కీలక అప్డేట్ ఇస్తామని చిత్ర యూనిట్ నిన్న (సోమవారం) నిన్న ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 7:11 నిమిషాలకు దర్శకుడు ఓంరౌత్ అప్డేట్ ను రివీల్ చేశారు. అదేంటంటే సినిమా మోషన్ పోస్టర్ చిత్రీకరణ ప్రారంభించామని తెలిపారు. ఆది పురుష్ ప్రపంచాన్ని తయారు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సినిమాలో విఎఫ్ఎక్స్ కోసం పని చేస్తున్న యూనిట్ సభ్యుల ఫోటోను పోస్ట్ చేసారు. ప్రభాస్ సినిమా నుండి అప్డేట్ అనగానే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఓం రౌత్ ఆ ఆశలపై నీళ్లు చల్లాడు. అప్డేట్ అంటే సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో ప్రకటిస్తారని ఆశించారు. కానీ ఓం రౌత్ ఇచ్చిన అప్డేట్ చూసి షాక్ అయ్యారు. దీన్ని ఎవడైనా అప్డేట్ అంటారా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

follow us