బాలయ్య షో కు ప్రాణ స్నేహితుడితో కలిసి వస్తున్న ప్రభాస్

బాలయ్య షో కు ప్రాణ స్నేహితుడితో కలిసి వస్తున్న ప్రభాస్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న Unstoppable with NBK సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సీజన్ లలో అనేక మంది దర్శక నిర్మాతలు , హీరోలు గెస్ట్ లు వచ్చి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నారట. కేవలం ఆయన మాత్రమే కాదు ఆయన ప్రాణ స్నేహితుడు హీరో గోపీచంద్ ను వెంటపెట్టుకొని బాలయ్య తో సందడి చేసేందుకు వస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈనెల 11న ప్రారంభంకాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వర్షం సినిమాతో గోపిచంద్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ తర్వాత కూడా వీరి ఫ్రెండ్ షిప్ కొనసాగింది. డార్లింగ్ తో తనకున్న అనుబంధం గురించి ఇప్పటికే పలు సందర్భాలో చెప్పుకొచ్చారు గోపిచంద్. ఇక ఇప్పుడు వీరిద్దరు కలిసి బాలయ్య షోలో రచ్చ చేయనున్నారట. వీరికి సంబంధించిన ఎపిసోడ్ న్యూయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.

follow us