రాజగమౌళి ఫై ప్రభాస్ ప్రశంసలు

రాజగమౌళి ఫై ప్రభాస్ ప్రశంసలు

దర్శక ధీరుడు తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ తాజాగా న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ కు నామినేట్ కావడంతో సినీ ప్రముఖులు , సినీ లవర్స్ చిత్ర యూనిట్ ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరుణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం సోషల్ మీడియా వేదికగా రాజమౌళి , కీరవాణి లపై ప్రశంసలు కురిపించారు.

ది గ్రేటెస్ట్ రాజమౌళిగారు ప్రతిష్టాత్మక న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ ని ఉత్తమ దర్శకుడిగా సొంతం చేసుకుంటూ ప్రపంచాన్ని జయించబోతున్నారు. ఉత్తమ సంగీత దర్శకులుగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ ని అందుకుంటున్నందుకు శుభాభినందనలు’ అంటూ ప్రభాస్ సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసాడు.

ప్రభాస్ పోస్ట్ కు రాజమౌళి వెంటనే రిప్లై ఇచ్చారు. ‘థ్యాక్యూ డార్లింగ్.. నేను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సాధిస్తానని నేను నమ్మని సమయంలో నువ్వు నన్న బలంగా నమ్మావు’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Tags

follow us