ప్రభాస్ రాధేశ్యామ్ కోసం అక్కడ భారీ సెట్.. !

ప్రభాస్ పూజ హెగ్డే హీరోహీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాకు జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది. అయితే సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ ఓ రొమాంటిక్ సాంగ్ మాత్రం మిగిలిపోయింది. ఇటీవల ఈ సాంగ్ షూటింగ్ కోంస షెడ్యూల్ కేటాయించి షూటింగ్ ను మొదలు పెట్టగా కరోనా కారణంగా బ్రేక్ పడింది. దాంతో కరోనా పరిస్థితుల వల్ల ఈ సాంగ్ ను షూట్ చేయకుండానే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారట.
అయితే ఈ సినిమా బాలీవుడ్ రైట్స్ ను సొంతం చేసుకున్న టీ సిరీస్ అందుకు నిరాకరించినట్టు సమాచారం.సినిమాలో పూజ ప్రభాస్ మధ్య వచ్చే ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని కాబట్టి ఈ సాంగ్ ను ఖచ్చితంగా చిత్రించాలని టీసిరీస్ సూచించిందట. దాంతో సాంగ్ ను చిత్రించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ముంబైలో ఓ భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేస్తన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను పిరయాడికల్ ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను రీచ్ అవుతారా లేదా అన్నది చూడాలి.