ప్రాజెక్ట్ కె సెట్ లో సింగీతం శ్రీనివాస రావు

ప్రాజెక్ట్ కె సెట్ లో సింగీతం శ్రీనివాస రావు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ – మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ కె. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ మూవీకి మెంటర్ గా సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ దశలోనే తాను కావాల్సిన సూచనలు సలహాలు ఇచ్చానని గతంలో తెలిపిన శ్రీనివాస్ రావు..తాజాగా చిత్ర సెట్ లో సందడి చేసాడు. ప్రభాస్ తో కలిసి లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు వున్న ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ప్రభాస్ ఈ మూవీ తో పాటు మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ , కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇలా మూడు సినిమాలు సెట్స్ ఫై ఉన్నాయి. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌనత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీ చేసాడు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

follow us