ప్రభాస్ బలాలు..బలహీనతలు ఇవే

యంగ్ రెబెల్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. బాహుబలి ముందు ఓ లెక్క బాహుబలి తర్వాత మరో లెక్క అన్నట్లు తన గ్రాఫ్ పెరిగింది. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలి సిరీస్ ..ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఆ మూవీ తర్వాత ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా అభిమానులయ్యారు. కేవలం సామాన్య సినీ ప్రేక్షకులే కాదు..సినీ ప్రముఖులు సైతం జయహో..ప్రభాస్ అనేసారు. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో అలరించిన ప్రభాస్..ప్రస్తుతం నాల్గు పాన్ మూవీస్ ను లైన్లో పెట్టాడు.
ఇదిలా ఉంటె ప్రభాస్ బలాలు..బలహీనతలు ఇవే అని తెలిపాడు ఆయన స్నేహితుడు..ప్రభాస్ శ్రీను. శ్రీను అంటే చాలామందికి తెలియదు కానీ ప్రభాస్ శ్రీను అంటే మాత్రం ఎవ్వరైనా టక్కున గుర్తు పట్టేస్తారు. నందమూరి హరికృష్ణ హీరోగా నటించిన సీతయ్య మూవీతో ప్రభాస్ శ్రీను వెండితెరకు పరిచమయ్యాడు. కానీ విక్రమార్కుడు, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యాడు. ప్రభాస్ మిత్రుడైన శ్రీను అతని అసిస్టెంట్ గా చేరి ప్రభాస్ శ్రీనుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ తో పాటు శ్రీను యాక్టింగ్ నేర్చుకున్నాడు. ప్రభాస్ స్టార్ అయ్యాక పక్కనే ఉంచుకుని అతన్ని నటుడ్ని చేశాడు. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో ప్రభాస్ శ్రీను నటించాడు. ఆ తర్వాత ఏమైందో కానీ శ్రీను..ప్రభాస్ సినిమాల్లో కనిపించడం మానేసాడు. ప్రభాస్ కు – శ్రీను మధ్య విభేదాలు వచ్చాయని , అందుకే శ్రీను ను పక్కకు పెట్టేసాడని అంత మాట్లాడుకున్నారు. మరి నిజంగా విభేదాలు వచ్చాయా..లేదా అనేది క్లారిటీ గా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటె .. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను.. ప్రభాస్ యొక్క బలాలు, బలహీనతలు బయటపెట్టాడు. ప్రభాస్ బలహీనత అతని మంచితనమే అని , ఆయన ఎవరినైనా తేలికగా నమ్మేస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే ప్రభాస్ తో విరోధం మాత్రం మంచిది కాదన్నారు. ప్రభాస్ నవ్వు ఎంత అందంగా ఉంటుందో మౌనం అంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి విబేధం తలెత్తితే అతనితో ఇక కలవడానికి ఇష్టపడడు. జీవితాంతం దూరం పెట్టేస్తాడు. అందుకే ప్రభాస్ తో ఎవరూ గొడవ పెట్టుకోరని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. ప్రభాస్ కి ఉన్న మరొక బలహీనత ఆయన అప్డేట్ అవ్వడానికి ఇష్టపడరట. ఎప్పుడూ ఒకేలా ఉంటారట. పరిస్థితులకు అనుగుణంగా మారడం ప్రభాస్ కి అలవాటు లేదని ప్రభాస్ శ్రీను తెలిపాడు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే..బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీ ని పూర్తి చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కే, మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ మూవీస్ చేస్తున్నాడు.