లెక్కల మాస్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్..?

లెక్కల మాస్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్..?

లెక్కల మాస్టర్ గా అందరి చేత పిలిపించుకునే సుకుమార్ కు..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్..ప్రస్తుతం పుష్ప 2 తో బిజీ గా ఉన్నారు. మరోపక్క ప్రభాస్ సైతం ఒకటి , రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఈ తరుణంలో సుకుమార్ తో ఓ సినిమా చేయాలనీ ప్రభాస్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” , నాగ్ అశ్విన్ తో “ప్రాజెక్ట్ కే” , మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని చేస్తున్నారు. అంతేకాకుండా అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగ తో కూడా “స్పిరిట్” అనే సినిమా చేస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్ట్స్ ఉండగా..ఇప్పుడు సుకుమార్ కు కూడా ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కాకపోతే ఈ సినిమా సెట్స్ పైకి రావాలంటే చాల నెలలే పడుతుంది.

follow us