ప్రభాస్ బ్యాంకు లోన్ తీసుకున్నాడా..?

ప్రభాస్ బ్యాంకు లోన్ తీసుకున్నాడా..?

ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. ఆయన ఒక్క సినిమా చేస్తే వంద కోట్లు ఇచ్చేందుకైనా నిర్మాతలు రెడీ గా ఉన్నారు..మరోపక్క ఒకటి , రెండు కాదు దాదాపు మూడు , నాల్గు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వాటితోనే వందల కోట్ల రెమ్యూనరేషన్ లు ఇచ్చి ఉంటారు. అలాంటిది ఆయన బ్యాంకు నుండి లోన్ తీసుకోవడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ లోన్ వెనుక తన ల్యాండ్ ఉందని అంటున్నారు.

హైదరాబాద్‌లో ఉన్న తన ప్రాపర్టీపై ప్రభాస్ ఓ బ్యాంక్‌లో రూ. 21 కోట్ల రుణం తీసుకున్నాడట. చిన్న అమౌంట్ కోసం ప్రాపర్టీని బ్యాంకులో పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే.. డబ్బులు అవసరమై కాదు.. ప్రాపర్టీ కబ్జా కాకుండా ఉంటుందనే ప్రభాస్ ఆ పని చేసాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజాలు ఉన్నాయనేది చూడాలి.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘ఆదిపురుష్’, ‘సలార్’ , ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి.

follow us